Karnataka: భగత్ సింగ్ నాటకం ప్రాక్టీస్ చేస్తూ బాలుడు మృతి
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
Karnataka: పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
చిత్రదుర్గలోని ఎస్ఎల్వీ పాఠశాలలో సంజయ్ గౌడ్ (12) అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే తర్వలో పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ నాటకాన్ని ప్రదర్శించనున్నారు. దీనిలో సంజయ్.. భగత్ సింగ్ పాత్ర పోషించనున్నాడు. ఈ నాటకం కోసం విద్యార్థులందరి లాగానే సంజయ్ కూడా ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అయితే శనివారం రోజు రాత్రి తన ఇంట్లో రిహార్సల్స్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే డ్రామాలో చివరి అంకమైన ఉరి వేసుకునే సన్నివేశాన్ని ప్రాక్టీస్ చెయ్యదలిచాడు.
అనుకున్నదే తడవుగా ఇంట్లోని తన గదిలోని ఫ్యాన్‌కు తాడు కట్టి.. తన మెడకు ఉచ్చు బిగించుకున్నాడు. అంతే దానితో నిమిషాల వ్యవధిలోనే ఆ బాలుడు చనిపోయాడు. కొద్ది సేపటికి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి పిల్లవాడు తాడుకు వేలాడుతూ కనిపించాడు. దానితో వెంటనే సంజయ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే సంజయ్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దానితో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పాము కాటేసిన బాలుడు సేఫ్.. బాలుడు కొరిన పాము మృతి