Published On:

Rape accused Roadshow: గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్.. రోడ్ షో చేస్తూ వెళ్లారు

Rape accused Roadshow: గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్.. రోడ్ షో చేస్తూ వెళ్లారు

Rape Accused Roadshow after getting Bail in Karnataka: వాళ్లేమీ ఉద్యమకారులు కాదు, సామాన్య ప్రజలకోసం పోరాడి జైలుకు వెళ్లలేదు. రేప్ కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో వాళ్లకు సత్కారాలు సన్మానాలు, ఆపై రోడ్డుగుండా ఊరేగింపు. ఇంత చిల్లర తనంగా ఎవరూ ఉండరన్నట్టు వ్యవహరించారు.

 

జనవరి 2024న ఓ యువతి తన ఫ్రెండ్ తో కర్ణాటకలోని ఓ హోటల్ ఉంది. అనుకోకుండా 19మంది వాళ్ల గదిలోకి చొరబడి యువకున్ని కొట్టి యువతిని పక్కనే ఉన్న అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏడుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం19మందిని అరెస్ట్ చేశారు. మొదట బాధితురాలు నిందితులను గుర్తుపట్టినప్పటి ఆతర్వాత విచారణ సాగుతుండగా… మొన్న కేసు న్యాయమూర్తి ముందరకు విచారణకురాగా తాను నిందితులను గుర్తుపట్టడం లేదని చెప్పింది. దీంతో న్యాయమూర్తి సదరు యువకులకు బెయిల్ ఇచ్చారు. కేసును వాయిదా వేశాడు. నిందితులు మహమ్మద్ సాదిక్, షోయబ్ ముల్లా, తోసిఫ్ చోటి, సమీవుల్లా లాలానవర్, అప్తాబ్, మదర్ సాబ్, రియాజ్ సావిక్రి.

 

ఈ ఘటన కర్ణాటకలోని హవేరిలోని అలక్కి అలూర్ పట్టనంలో జరిగింది. మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితులు విడుదలయ్యారు. దీంతో వారి స్నేహితులు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులకు రోడ్డుపై విక్టరీ పరేడ్ మాదిరిగా ర్యాలీగా వెళ్లి హంగామా చేశారు. కారు సన్ రూఫ్ ను ఓపెన్ చేసిన నిందితుడు హ్యాండ్ వేవ్ చేస్తూ అభివాదం చేశాడు. నిందితుల ఫ్రెండ్స్ బైక్ ల మీద స్పీడ్ గా వెళ్తూ బిగ్గరగా రోడ్డుపై అరుచుకుంటూ వెళ్లారు. రోడ్ షో చేసినవారిలో మహమ్మద్ సాదిక్, షోయబ్ ముల్లా, తోసిఫ్ చోటి, సమీవుల్లా లాలానవర్, అప్తాబ్, మదర్ సాబ్, రియాజ్ సావిక్రి ఉన్నారు.

 

విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వీరిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. విచక్షణ విలువలు లేని వారే ఇలా బాధ్యత లేకుండా, సమాజంలో పిచ్చిపట్టిన జంతువులవలే ప్రవర్తిస్తారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: