Munugode: మూడు రోజులపాటు అక్కడ వైన్ షాప్స్ బంద్.. ఎందుకంటే..?
తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం యుద్ధభూమిని తలపిస్తోంది. ఉపఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులతో రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు.
Munugode: తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గం యుద్ధభూమిని తలపిస్తోంది. ఉపఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులతో రణరంగంగా మారింది. గత కొద్దిరోజులుగా మునుగోడులో రాజకీయనేతల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు నియోజకవర్గంలో గల్లీగల్లీలోని ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అక్రమ కార్యకలాపాలు, మరియు మద్యం విక్రయాలు జరుపడం నేరమని అధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్ లను పోలీసులు సీజ్ చేశారు. మరియు 48 మందిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 118 కేసులు నమోదు చేశారు.
ఇకపోతే నవంబర్ 1న మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు.
ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఏడు మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారి తెలిపారు. కాగా బైపోల్స్ నేపథ్యంలో నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: దేవుడి పై ప్రమాణం చేసిన బండి సంజయ్.. యాదాద్రికి సీఎం కేసీఆర్ వస్తారా?