Ramdev Baba: మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణలు
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్ మహిళలకు క్షమాపణలు తెలిపారు.
Ramdev Baba: మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్ మహిళలకు క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలంటూ లేఖ ద్వారా పేర్కొన్నారు.
महाराष्ट्र के उपमुख्यमंत्री जी की पत्नी के सामने स्वामी रामदेव द्वारा महिलाओं पर की गई टिप्पणी अमर्यादित और निंदनीय है। इस बयान से सभी महिलाएँ आहत हुई हैं, बाबा रामदेव जी को इस बयान पर देश से माफ़ी माँगनी चाहिए! pic.twitter.com/1jTvN1SnR7
— Swati Maliwal (@SwatiJaiHind) November 26, 2022
దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ గతవారం రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగితి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన రాందేవ్ బాబా తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్‌లో వెల్లడించారు. రాందేవ్ క్షమాపణ లేఖను కూడా అందులో పోస్ట్ చేశారు.
बाबा रामदेव उर्फ राम किसन यादव यांनी ठाणे येथील एका सार्वजानिक कार्यक्रमात महिलांसंबंधी अत्यंत खालच्या पातळीवर जाऊन विधान केले होते. या वक्तव्याची राज्य महिला आयोगाने गंभीर दखल घेत बाबा रामदेव उर्फ राम किसन यादव यांना याबाबतीत आपला खुलासा दोन दिवसाच्या आत सादर करण्यासाठी नोटिस१/२ pic.twitter.com/umI27luSK7
— Rupali Chakankar (@ChakankarSpeaks) November 28, 2022
‘‘మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ ఎవరైనా బాధపడినట్లయితే దానికి నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని రాందేవ్ బాబా ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మహిళలు ఏమీ ధరించకపోయినా అందంగా కనిపిస్తారు.. బాబా రామ్ దేవ్