Last Updated:

Mammootty Diagnosed With Cancer: మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టిపై అలాంటి పుకార్లు – స్పందించిన టీమ్‌!

Mammootty Diagnosed With Cancer: మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టిపై అలాంటి పుకార్లు – స్పందించిన టీమ్‌!

Mammootty Team Denied Cancer Rumours: మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై తాజాగా ఆయన టీం స్పందిందించింది. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఆయన షూటింగ్‌లకి బ్రేక్‌ ఇచ్చారంటూ మాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులంత ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించింది.

క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నారంటూ వస్తున్న ఈ వార్తలను ఖండించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. “మమ్ముట్టి ప్రస్తుతం రంజాన్‌ సెలవుల్లో ఉన్నారు. రంజాన్‌ ఉపవాసంలో ఉన్నందున్న ఆయన సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే షూటింగ్‌కి వెళ్లడం లేదు. త్వరలోనే తిరిగి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సుధీర్ఘ విరామం తర్వాత ఆయన మోహన్‌ లాల్‌-మహేష్‌ నారాయణన్‌ సినిమా షూటింగ్‌కి తిరిగి పాల్గొంటాను. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజం కాదు. అవన్ని ఫేక్‌ న్యూస్‌” అని స్పష్టం చేసింది.

కాగా ప్రస్తుతం మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు మల్టీస్టారర్‌గా మహేష్‌ నారాయణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా మొదలైంది. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న మమ్ముట్టి ఆ తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనన్నున్నారు. దీనికి ఎంఎంఎంఎన్‌(MMMN)అనే వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పైకి తీసుకువచ్చారు. ఇద్దరు మలయాళ స్టార్స్‌ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తిసిపోకుండ ఈ చిత్రాన్ని మహేష్‌ నారాయాణ్‌ భారీ ప్లాన్‌ చేశారట. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ని శ్రీలంకలో ప్రారంభించారు.