Last Updated:

Bandla Ganesh: కృతజ్ఞత లేని బతుకు.. నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటర్..?

Bandla Ganesh: కృతజ్ఞత లేని బతుకు.. నాగబాబుకు స్ట్రాంగ్ కౌంటర్..?

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బండ్ల గణేష్ ట్వీట్స్, ఇంటర్వ్యూస్ మాత్రమే కనిపించేవి. మనసులో ఎలాంటి కల్మషం  లేకుండా ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉండేవాడు. దాని ద్వారా ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కున్నాడు.

 

ఇక ఈ వివాదాల విషయం పక్కన పెడితే.. బండ్ల గణేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అని అనడం కంటే భక్తుడు అని చెప్పొచ్చు. అంతలా ఆయనను ఆరాధించాడు. పవన్ కు ఎలివేషన్ ఇవ్వాలంటే అది కేవలం బండ్లన్న వలనే అవుతుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు. అయితే పవన్- బండ్ల మధ్య ఉన్న బంధాన్నికి త్రివిక్రమ్ అడ్డుకట్ట వేశాడు. దానివలన బండ్ల గణేష్.. చాలాసార్లు త్రివిక్రమ్ పై మండిపడ్డాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ ఒకపక్క సినిమాలను, ఇంకోపక్క రాజకీయాలను పూర్తిగా వదిలేసి కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు.

 

బండ్ల గణేష్ ఏ ట్వీట్ చేసినా కూడా అది సంచలనంగా మారుతూనే ఉంటుంది. పవన్ రాజకీయాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు  ఆయన ఫ్యాన్స్ తో పాటు చాలామంది హెల్ప్ చేశారు. డైరెక్ట్ గా అయినా.. ఇన్ డైరెక్ట్ గా అయినా అందులో బండ్ల గణేష్ కూడా ఒకడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బండ్లన్న  ఒక్కడే కాదు.. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో నిలబడ్డారు అంటే ఎంతోమంది కృషి ఉంది.

 

అయితే నిన్న పవన్ అన్న నాగబాబు చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం ఆవిర్భావ సభలో నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాను షేక్ చేసాయి. సభలో నాగబాబు మాట్లాడుతూ.. ” పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి రెండు కారణాలు. ఒకటి పవన్, రెండు పిఠాపురం ప్రజలు. వీరిద్దరి వలనే ఆయనకు విజయం దక్కింది. ఇవి కాకుండా పవన్ ను ఎవరైనా గెలిపించడానికి దోహదపడ్డామని వారనుకుంటే అది వారి ఖర్మ. అధికారంలో ఉన్నామని అహంకారంతో మాట్లాడొద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకొనేది లేదని చెప్పుకొచ్చాడు.

 

ఇక నాగబాబు వ్యాఖ్యలకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. ” కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.” ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి” అంటూ రాసుకొచ్చాడు. పవన్ కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతోమంది కృషి చేశారు. వారందరిని ఇలా నాగబాబు అవమానించడం బాలేదని బండ్ల గణేష్ ఇన్ డైరెక్ట్ గా చెప్పిన్నట్లు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి బండ్లన్న ట్వీట్.. నాగబాబును ఉద్దేశించా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.