Emergency OTT Release: సడెన్‌గా ఓటీటీకి వచ్చిన కంగనా ‘ఎమర్జెన్సీ’ – మూడు రోజుల ముందే స్ట్రీమింగ్, ఎక్కడంటే!

Emergency Movie Now Streaming on Netflix: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జేన్సీ'(Emergancy OTT). మాజీ ప్రధాని ఇందిర గాంధీ విధించిన ఎమర్జేన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. భారీ బడ్జెట్‌తో స్వయంగా కంగనా ఈ సినిమా నిర్మించింది. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమా జనవరి 17న ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మొత్తంగా రూ. 21 కోట్లు మాత్రమే రాబట్టింది. బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన ఈ చిత్రం సెడన్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. మార్చి 17న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటన కూడా ఇచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ ముందునే ఈ సినిమాను స్ట్రీమింగ్‌కి ఇచ్చింది. దీంతో మూవీ లవర్స్ అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఎమర్జేన్సీ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రటించిన టైం కంటే మూడు రోజుల ముందే మూవీ ఓటీటీలోకి రావడంతో మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతున్నారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జేన్సీ టైంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కోసం కంగనా నిర్మాత మారింది. ఈ మూవీ నిర్మించేందుకు ఆమె తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించగా.. అనుపమ్ ఖేర్, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పడేలు కీలక పాత్రలు పోషించారు.