Rashmika Mandanna: రష్మికకు రక్షణ కల్పించండి – అమిత్ షాకు లేఖ!

Seek Protection For Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కమ్యునిటికి చెందిన వారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమెపై కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నటించిన ఛావా మూవీ కార్యక్రమంలో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని, మీ అందరి ప్రేమకు ధన్యురాలిని అని చెప్పింది.
కన్నడిగుల ఆగ్రహం
అయితే దీనిపై కన్నడిగులు భగ్గుమన్నారు. కర్ణాటకకు చెందిన ఆమె హైదరాబాద్ చెప్పుకోవడమేంటని, నటిగా తనకు కెరీర్ ఇచ్చిన కన్నడ పరిశ్రమను చిన్న చూపు చూస్తోందని కన్నడిగులు మండిపడ్డారు. అలాగే కర్ణాటక ఎమ్మెల్యే, మంత్రులు సైతం రష్మికపై అసహనంతో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యేకం ప్రెస్‌మీట్ పెట్టి మరి రష్మిక నిప్పులు చెరిగారు. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఆమెకు వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో రష్మికకు చెందిన ‘కొడవ’ వర్గం వారు ఆమెకు మద్దతుగా నిలిచారు.
దూమారం రేపిన ఛావా కామెంట్స్
సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మికకు భద్రత కల్పించాలని కోరుతూ కొడవ నేషనల్ కౌన్సిల్ బోర్డు చైర్మన్ ఎన్‌యు నాచప్ప కేంద్ర హోం మంత్రి ఆమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర్‌లకు లేఖ రాసింది. ఛావా ఈవెంట్‌లో రష్మిక చేసిన కామెంట్స్ రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని సీఎన్‌సీ లేఖలో పేర్కొంది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమంలో అఖండ విజయాన్ని సాధించిందని సీఎన్‌సీ ఛైర్మన్ అన్నారు.
రష్మికకి తగిన గుణపాఠం చెప్పాలి
అదే విధంగా రష్మికకు మాట్లాడే స్వేచ్చ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందని, కానీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందన్నారు. తాను వెనుకబడిన వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారన్నారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే రష్మిక కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటక మండ్యాకు చెందిన ఎమ్మెల్యే రవి గనిగ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. రష్మికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందన్నారు. బెంగళూరు వేదికగా జరుగతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సైతం రష్మిక నిప్పులు చెరిగారు. తల పోగరుతో ఉన్న వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసంటూ సంచలనవ్యాఖ్యలు చేశారు.