Kona Venkat: అంజలితో నాకున్న సంబంధం అదే.. కారు గిఫ్ట్.. ఎవడు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్

Kona Venkat: రచయిత కోన వెంకట్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఎన్నో మంచి కథలను అందించాడు. 20023 లో ఒకరికి ఒకరు సినిమాతో కోనా ప్రస్థానం మొదలయ్యింది. ఇక గతేడాది రిలీజ్ అయినా గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా ఆయనే కథను అందించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
కోనా వెంకట్ ప్రస్తుతం పలు సినిమాలకు కథలను అందించే పనిలో బిజీగా మారాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా కోనా వెంకట్, హీరోయిన్ అంజలి మధ్య సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆ వార్తలను అంజలి పట్టించుకోలేదు. కోనా కూడా పలుసార్లు మాటను దాటవేస్తూ వచ్చినా ఈసరి మాత్రం వారి సంబంధాన్ని బయటపెట్టాడు.
అంజలితో తనకున్న సంబంధం ఎవరు ఎలా అనుకుంటే అలాంటిదే అని, ఎవరు ఎన్ని అనుకున్నా అంజలిని వదిలేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. ” అంజలి మీద ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మీరు ఆమె నా చెల్లి అని పిలవమంటే.. నేను చెల్లి అనే పిలుస్తాను. మీరు ఆమెను కూతురు అని పిలవమంటే కూతురు అనే పిలుస్తా.. ఫ్రెండ్ అనమంటే ఫ్రెండ్ అని పిలుస్తా.
NTR: వివాహ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. అన్న వచ్చాడు కానీ, తమ్ముడు ఎక్కడ.. ?
అంజలి పర్సనల్ లైఫ్ తెల్సినవారు చాలా తక్కువమంది. ఆమె బాల్యం చాలా బ్యాడ్ గా గడిచింది. అంజలి వాళ్ల పేరెంట్స్ దగ్గర పెరగలేదు. పిన్ని దగ్గర పెరిగింది. ఆమె అంజలిని అబ్యూజ్ చేసింది. నాకు ఏమనిపించింది అంటే.. అంజలికి ఒక సపోర్ట్ కావాలి. బాధలను చెప్పుకోవడానికి అయినా.. దైర్యం చెప్పడానికి అయినా ఒక భుజం ఉండాలి అనిపించింది. అందుకే ఆ భుజంగా నేను మారాను.
నా క్లోజ్ ఫ్రెండ్ కు, నా చెల్లికి, నా కూతురుకు ఒక అవసరం వస్తే ఎలా అయితే నిలబడతానో.. అలాగే అంజలి కోసం నేనెప్పుడూ నిలబడతాను. దాన్ని రకరకాలుగా అనుకుంటే మాత్రం ఐ డోంట్ కేర్. ఇంత కంపేర్ చేసి మాట్లాడుతున్నాను అంటే.. వేరేలా చూసేంత నీచుడును కాను. అందరికీ కన్వే అవ్వాలనే ఇలాంటి రిలేషన్స్ తో కంపేర్ చేశాను.
గీతాంజలి సినిమా అప్పుడే అంజలి నాకు పరిచయం. అప్పటికీ ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చేసేసింది. అంతేనా అప్పటికే చెన్నైలో ఆమె ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. వాళ్ల పిన్ని.. ఆస్తి తగాదాల్లో గొడవలు, పోలీస్ కేసులు. మొత్తం ఆస్తులను కబ్జా చేసేశారు. ఆమెకు ఎవరు సపోర్ట్ లేదు. ఆ సమయంలో పోలీసలతో పాటు నేను కూడా ఆమెకోసం తిరిగాను. అప్పటినుంచి అంజలికి అండగా.. ఒక ఫ్రెండ్ గా నిస్వార్థంగా నిలబడ్డాను.
అంజలికి నాతో ఉన్న సంబంధం మీరేమైనా అనుకోండి. గురువు, తండ్రి, ఫ్రెండ్, అన్న, దేవుడు ఇలా ఏది అనుకున్నా నాకేం అవసరం లేదు. అప్పట్లో అంజలి ఒక కారు కొన్నుకుంది. మీ చేతుల మీద కారు కీస్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇచ్చాను. అప్పుడు కోనా వెంకట్, అంజలికి కారు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. ఎవరు ఏమనుకున్నా.. గురువు, తండ్రి, ఫ్రెండ్, అన్న, దేవుడు ఈ 5 రిలేషన్స్ లోనే మేము ఉన్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.