Last Updated:

Jr NTR: జపాన్ లో దేవర రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయిన ఎన్టీఆర్

Jr NTR: జపాన్ లో దేవర రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయిన ఎన్టీఆర్

Jr NTR Devara Promotions For Japan Release: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు దేవర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలొ తెరకెక్కిన దేవర మూవీ గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్ల వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది. మార్చి 28న ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీం మూవీ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ వర్చ్యూవల్ ద్వారా దేవర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఆన్ లైన్ లో అక్కడి మీడియాతో ముచ్చటిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ విడుదలకు ముందు దేవర టీం జపాన్ కూడా వెళ్లనుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు తదితరులు పాల్గొననున్నారని తెలుస్తోంది. కాగా మన తెలుగు సినిమాలు జపాన్ లో విశేష ప్రక్షకాదరణ పొందుతున్నాయి.

బహుబలి నుంచి మన తెలుగు పాన్ ఇండియా సినిమాలన్ని జపాన్ రిలీజ్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తో పాటు రీరిలీజ్ కూడా అయ్యింది. ఆ సమయంలో జపాన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ ఉందో తెలిపోయింది. ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ థియేటర్లను సందర్శించిన ప్రేక్షకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జపాన్ ఆడియన్స్ ఎన్టీఆర్, చరణ్ లకు ఘనస్వాగతం పలికారు.ముఖ్యం తారక్ అభిమానుల నుంచి వివిధ బహుమతులు అందాయి.

దాంతో జపాన్ లో ఆయన క్రేజ్ చూసి అంతా సర్ప్రైజ్ అయ్యారు. ఇక దేవర విషయానికి వస్తే.. బాలీవుడ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ లో విడుదలైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి కథానాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. మరోవైపు ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ 2 తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగానే ప్రశాంత్ నీల్ చిత్రం మూవీ షూటింగ్ ప్రారంభించాడు. మార్చి షెడ్యూల్ నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

ఇవి కూడా చదవండి: