KCR: బిగ్ బ్రేకింగ్.. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్

Telangana Former CM KCR Hospitalized: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాధారణ పరీక్షల కోసం మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఇంటికి చేరుకుంటారని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.