CM Revanth Reddy: ‘ధరణి’ని కేసీఆర్ కనిపెట్టింది కాదు.. కాగ్ తప్పుబట్టిన ధరణిని తెలంగాణపై ఎందుకు రుద్దారు?
CM Revanth Reddy Speech in Assembly: ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం భూభారతి చట్టంపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందన్నారు. అమర్యాదతో సభాపతిపైనే పేపర్లు చింపి విసిరారన్నారు. ఈ సమయంలో చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా స్పీకర్ ఓపికతో వ్యవహరించారన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగే విధంగా సభను కొనసాగించినందుకు స్పీకర్‌కు అభినందనలు తెలిపారు. ప్రతి సమస్య భూమి చుట్టూ తిరుగుతుందన్నారు. ఆనాడు చరిత్రలో చాలామంది భూమి కోసం పోరాటాలు చేశారన్నారు. భూమి కోసం కొంతమంది భౌతికంగా దాడి చేశారన్నారు. భూమిని కాపాడుకునే ప్రయత్నంలో కొంతమంది విజయం సాధించారన్నారు. ఇలా భూముల కోసం ఎంతోమంది యోధులు త్యాగాలు చేశారన్నారు.
అధికారంచ అహంకారంతో కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరోచితంగా సాయుధ పోరాటం చేశారన్నారు. భూమి కోసం సకల తెలంగాణ జనులు పోరాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇందులో భాగంగానే చట్టాల ద్వారా యజమానుల హక్కులను కాపాడుకుంటూ వస్తున్నామన్నారు.
పీవీ నరసింహారావు సీఎంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారన్నారు. ఇందిరా గాంధీ హయాంలో అసైన్ మెంట్ భూములు పంపిణీ జరిగిందన్నారు. యూపీఎ హయాంలోనే భూ భారతి పేరుతో దేశవ్యాపంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ కుశ్రీకారం చుట్టారన్నారు.
కేసీఆర్.. సాంకేతిక అద్భుతం అంటూ ధరణి గురించి గొప్పలు చెప్పారన్నారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారన్నారు. తనకంటే నిపుణులు లేరన్నట్లు కేసీఆర్ చెప్పుకున్నారని గుర్తు చేశారు. ధరణి ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందన్నారు.
ధరణి కేసీఆర్ కనిపెట్టింది కాదని, 2010లోనే ఒరిస్సాలో ఈ ధరణి తీసుకొచ్చారని వెల్లడించారు. ఒరిస్సా ఈ ధరణలో లోపాలు ఉన్నాయని నాలుగేళ్ల తర్వాత కాగ్ చెప్పిందన్నారు. ఈ ధరణిని పూర్తిగా తప్పుబడుతూ 2014లో కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కాగ్ తప్పుబట్టిన ధరణిని తెలంగాణపై ఎందుకు రుద్దారు? అని ప్రశ్నించారు.