Last Updated:

Year End Discount: ఈ కార్లను గుర్తుంచుకోండి.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్.. లక్షల్లో ఆఫర్లు..!

Year End Discount: ఈ కార్లను గుర్తుంచుకోండి.. ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్.. లక్షల్లో ఆఫర్లు..!

Year End Discount: కొత్త కారు కొనేందుకు డిసెంబర్ నెలను ఉత్తమంగా పరిగణిస్తున్న ఈ సమయంలో దేశంలోని కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులు, ఆఫర్లను అందిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. కాబట్టి కొత్త కారు కొనడానికి ఈ నెల మంచిది. ఈ నేపథ్యంలో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం.

Tata Punch
మీరు ఈ నెలలో టాటా పంచ్ (MY2023) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వాహనంపై రూ. 1.55 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఈ వాహనం ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంజన్ గురించి మాట్లాడితే టాటా పంచ్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది, ఇది 72.5పీఎస్ పవర్, 103 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ శక్తివంతమైనది, మెరుగైన మైలేజీని కూడా అందిస్తుంది. బ్రేకింగ్ పరంగా కారు బాగుంది.

Tata Safari
ఈ డిసెంబర్ నెలలో మీరు టాటా సఫారీని కొనుగోలు చేస్తే  దానిపై రూ. 3.70 లక్షల వరకు ఆదా చేయచ్చు. అయితే ఈ తగ్గింపులు సఫారి పాత స్టాక్‌పై అందుబాటులో ఉన్నాయి. కొంతమంది టాటా డీలర్‌ల వద్ద ఇప్పటికీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ సఫారి స్టాక్ ఉంది. ఈ మోడల్‌లు డిసెంబర్‌లో మరింత లోతైన తగ్గింపులతో వస్తాయి,  ఎక్స్‌ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌తో కస్టమర్‌లు మొత్తం రూ. 3.70 లక్షల వరకు ఆదా చేస్తారు.

Hyundai Venue
ఈ నెలలో మీరు హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ వాహనంపై రూ.75,629 ఆదా చేయచ్చు. ఈ తగ్గింపులో క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వెన్యూ ధరలు రూ.7.34 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది పెట్రోల్ ఇంజన్‌లో లభిస్తుంది. వెన్యూలో మీరు 1.0L, 1.2L పెట్రోల్ ఇంజిన్‌లను పొందుతారు, మీరు మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

Mahindra XUV400
మీరు ఈ నెలలో మహీంద్రా XUV400ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఈ వాహనంపై రూ. 3.1 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. XUV400 టాప్-స్పెక్ EL ప్రో వేరియంట్‌పై మాత్రమే ఈ తగ్గింపు ఇస్తున్నారు. భారతదేశంలో మహీంద్రా XUV400  ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.74 లక్షల నుండి రూ. 17.69 లక్షల వరకు ఉంది. ఇందులో 39.4kWh,  34.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. XUV400 రోజువారీ వినియోగానికి మంచి ఎంపిక. ఇది కాకుండా మీరు XUV700లో రూ. 40,000 వరకు ఆదా చేయవచ్చు.