Junior Doctors’ Strike: మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం..
తెలంగాణ వైద్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల క్వార్టర్స్‌లో దామోదరతో జూడాలు చర్చించారు. కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
Junior Doctors’ Strike: తెలంగాణ వైద్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. మంత్రుల క్వార్టర్స్‌లో దామోదరతో జూడాలు చర్చించారు. కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రి ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు జూడాలు. అంతవరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఓపీ సేవలు, సర్జరీలు, వార్డు సేవలు నిలిపివేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
రోగులకు ఇబ్బందులు..(Junior Doctors’ Strike)
ఐదు రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు తమ స్టైఫండ్‌లు చెల్లించాలని, ఇతర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగారు. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం సంతృప్తికరంగా స్పందించకపోవడంతో వైద్యులు ఆందోళనకు దిగారు. అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి, అయితే కొనసాగుతున్న సమ్మె కారణంగా అనేక తెలంగాణా ఆసుపత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని జూనియర్ వైద్యులు కోరుతున్నారు.. తెలంగాణ వ్యాప్తంగా 4000 మందికి పైగా జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు, పెంచిన ఉపకార వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు, వైద్యులపై దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, పలు కీలక అంశాలపై స్పష్టత రాకపోవడంతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను కొనసాగించారు.