Last Updated:

Big Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన 20 మంది కంటెస్టెంట్స్‌ వీళ్ళే !

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ సీజన్ కూడా ఐదోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఈ రియాలిటీ షో చూసే అభిమానులు కొన్ని లక్షల్లో ఉన్నారు మరి వాళ్ళని అలరించడానికి సరి కొత్తగా ముస్తాబైనది.

Big Boss 6 Telugu : బిగ్ బాస్  హౌస్‌లోకి వెళ్లిన 20 మంది  కంటెస్టెంట్స్‌ వీళ్ళే !

Big Boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ సీజన్ కూడా ఐదోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఈ రియాలిటీ షో చూసే అభిమానులు కొన్ని లక్షల్లో ఉన్నారు మరి వాళ్ళని అలరించడానికి సరి కొత్తగా ముస్తాబైనది.ఈ రియాలిటీ షో స్టార్ మా రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోతాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ బిగ్గ బాస్ షో నాగార్జున ఎంట్రీ తో గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ” బిగ్ బాస్ ఆట ఒక వేట లాంటిది ఆటలో చివరి వరకు పరిగెత్తాలిసిందే అలాగే గెలవాలనుకుంటే సరిపోదు, గెలవాలనే పట్టుదల కూడా ఉండాలి. ఈ ఆటలో ఎవరు ఆట వాళ్ళే ఆడాలి. స్నేహం చూపే స్నేహం , ప్రేమ ఇచ్చే చోట ప్రేమ ఇలా చూపించాలిసినప్పుడు మనం కొన్ని యుద్దాలే చేయాలిసి ఉంటుంది. ఒక్కో సారి మన ఎమోషన్స్ అన్ని అదుపులో పెట్టుకోవాలిసి ఉంటుంది. ఒంటరితనం మనకి దగ్గరైనప్పుడు మనకి కన్నీళ్లు పరిచయం అవుతాయి.ఈ ఆటలో మనకి ఎంత కోపం వచ్చిన అవన్నీ మనలోనే అదుపులో పెట్టుకోవాలి. ఈ ఆటలో మీరు ఏదైనా కొత్తగా చేయాలంటే నా తరువాతే అంటూ నాగార్జున పంచ్ డైలాగ్‌తో బిగ్ బాస్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చిన తరువతా బంగార్రాజు టైటిల్‌ పాటకు తన స్టైల్లో అమ్మాయిలతో కలిసి చిందులు వేశారు .ఇక ఆ తరువాత ఒకరి తరువాత కంటెస్టెంట్‌లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన 20 మంది కంటెస్టెంట్లు వీళ్ళే  కీర్తి కేశవ్‌ భట్‌ , పింకీ సుదీప , శ్రీహాన్ , నేహా చౌదరి చంటి , శ్రీ సత్య , అర్జున్ కళ్యణ్ గీతూ రాయల్ , అభినయ శ్రీ , రోహిత్ మెరినా , బాలదిత్య , వాసంతి కృష్ణన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ , ఇనయా సుల్తానా , ఆర్జే సూర్య , జబర్దస్త్‌ ఫైమా , ఆదిరెడ్డి , మోడల్‌ రాజశేఖర్‌ , యాంకర్‌ అరోహి రావ్‌, సింగర్‌ రేవంత్‌.

 

ఇవి కూడా చదవండి: