Nagarjuna: ఏఎన్నార్ బయోపిక్ బోర్ కొడుతుందేమో – నాగార్జున షాకింగ్ కామెంట్స్
Nagarjuna Comments on ANR Biopic: దివంగత నటీ, అలనాటి తార సావిత్ర బయోపిక్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత ఎందరో బయోపిక్‌లు వచ్చాయి కానీ, ‘మహానటి’కి దక్కిన ఆదరణ మరే మూవీకి రాలేదు. అక్కినేని నాగేశ్వరారావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు తెలుగు పరిశ్రమకు రెండు కళ్లులాంటి వారంటారు. అలాంటి వారి బయోపిక్ తెరపైకి వస్తే బాగుండని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ చేశారు. దీంతో ఆయన అభిమానులంతా ఏఎన్నార్ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బయోపిక్‌పై అయన కుమారుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేనిక ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం గోవాలోని పనాజీలో జరుగుతున్న భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖులు నటులు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి ఈ ఇఫీ వేదికగా నివాళులు అర్పించిన సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సెంటినరి స్పెషల్ ఏఎన్నార్:సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరావు’ పేరుతో ప్రత్యేక సెషన్‌ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాగార్జునకి ఏఎన్నార్ బయోపిక్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. “ఏఎన్నార్ బయోపిక్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఆయన జీవితాన్ని సినిమాగా తీయడం చాలా కష్టం. అయితే దానిని సినిమాగా తీయడం కంటే డాక్యూమెంటరీ తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే బయోపిక్‌లో విజయాలు, అపజయాలు ఉండాలి. ఒడిదుడుకులు ఉంటేనే సినిమా ఆసక్తిగా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ జీవితంలో ఎదుగుతూనే ఉన్నారు. జీవితంలో సక్సెస్ చూశారు కానీ, ఫెయిల్యూర్స్ చూడలేదు. అలాంటి దానిని తెరపై చూపాలంటే బోర్ కొడుతుందేమో. ఆ జీవిత కథలో కొన్ని కల్పితాలు జోడించి డాక్యుమెంటరీగా రూపొందించాలి” అని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.