BRS meeting in Khammam: ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రులు.. రెండో విడత కంటి వెలుగుకు శ్రీకారం
యాద్రాద్రి లో పూజల అనంతరం సీఎం కేసీఆర్ ( CM KCR), జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు. వారికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు.
BRS meeting in Khammam: యాద్రాద్రి లో పూజల అనంతరం సీఎం కేసీఆర్ ( CM KCR), జాతీయ నేతలు ఖమ్మం చేరుకున్నారు. వారికి పోలీసులు గౌరవ వందనం చేశారు.
అనంతరం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నలుగురు ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కార్యాలయంలోని తన కుర్చిలో కూర్చోబెట్టి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కంటి వెలుగు ప్రారంభం
ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభం అనంతరం రెండో విడత కంటి వెలుగు (kanti velugu scheme) కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్.
కేసీఆర్, కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్ చేతుల మీదుగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.
జాతీయ నేతల చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్లజోళ్ల పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి కంటి పరీక్షలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం.
గులాబీమయం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది.
భారీ సభతో ఖమ్మం మొత్తం గులాబీమయమైంది. నగరం చుట్టూ దాదాపు 5 కిలో మీటర్ల వరకు గులాబీ తోరణాలు, హోర్డింగ్స్, భారీ కటౌట్స్, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన నేతలంతా ఖమ్మం సభకు హాజరవుతున్నారు. మరో వైపు సభకు పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
బీఆర్ఎస్ సభ విశేషాలు
ఖమ్మం–వైరా రహదారిపై సుమారు 70 ఎకరాల్లో సభా ప్రాంగణం(BRS meeting in Khammam) నిర్మించారు.
వేదికను జర్మనీ టెక్నాలజీ వాటర్ , ఫైర్ రూఫ్ లతో రూపొందించారు.
దాదాపు 5 లక్షల మంది జనాభా ఈ సభకు హాజరవుతారని అంచనా.
ఈ వేదికపై ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మూన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ నేత డి. రాజా ఉండనున్నారు.
వీరితో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ , ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర మంత్రులు కూడా ఉండనున్నారు.
మిగిలిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రధాన నేతలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు.
నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రాంగణంలో 50 ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
మహిళలకు, పురుషులకు వేర్వేరుగా సమారు 75 వేలకు పైగా కుర్చీలను సిద్ధం చేశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/