Last Updated:

Work From Home: ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీసీఎస్

కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.

Work From Home: ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీసీఎస్

Work From Home: కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది చివరి నుంచే ఈ విధానాన్ని తీసేశాయి. మరికొన్ని హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా వారంలో మూడు రోజులు ఇంటి నుంచే పనిచేయాలనే కండిషన్ ను తీసుకొచ్చింది. అయితే ఈ రూల్ ను పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 

నెలకు 12 రోజులు ఆఫీస్ లో(Work From Home)

గత అక్టోబర్ నుంచే వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులుకు చెబుతోంది. వారంలో మూడు రోజులంటే.. నెలకు 12 రోజుల పాటు ఆఫీస్ నుంచే పని చేయాలి. కానీ, కొంతమంది ఉద్యోగుటు ఈ రూల్ ను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ఉద్యోగులకు టీసీఎస్ మెమోలు జారీ చేసింది. నిర్దేశించిన రోస్టర్ ప్రకారం కంపెనీకి వచ్చి రిపోర్టు చేయాలని సూచించింది. ఒక వేళ రూల్ పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మెమోలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

 

రాకపోతే కఠిన చర్యలు(Work From Home)

ఉద్యోగులకు నోటీసుల అంశంపై టీసీఎస్ స్పందించింది. గత రెండేళ్లుగా సంస్థలో కొత్తగా ఎంతో మంది నియమితులయ్యారని తెలిపింది. అలాంటి వారికి నేర్చుకోవడం, కలిసి పనిచేయడం, కొలిగ్స్ తో గడపడంతో పాటు సంస్థలో వర్క్ ఎన్విరాన్ మెంట్ ను అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని చెప్పింది. దీని వల్ల పని చేసే విధానాన్ని, సంస్థకు చెందిన వారమనే భావన కలుగుతుందని టీసీఎస్ వెల్లడించింది.

అత్యంత విలువైన బ్రాండ్ గా

మరో వైపు టీసీఎస్‌ అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచింది. ఇకపోతే అత్యుత్తమ 50 బ్రాండ్‌లతో ఈ జాబితాను ఇంటర్‌బ్రాండ్‌ సంస్థ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో రూ.1,09,576 కోట్ల బ్రాండ్‌ విలువతో టీసీఎస్‌ మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.65,320 కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో స్థానంలో నిలువగా.. ఇన్ఫోసిస్‌ రూ.53,324 మూడో స్థానంలో నిలిచింది.

గత పదేళ్ల కాలంలో ఇతర రంగాలను అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో దూసుకుపోతుంది. మొదటి 5 బ్రాండ్‌లలో 3 స్థానాలను టెక్నాలజీ కంపెనీలే దక్కించుకుంటున్నాయి. ఆర్థిక సేవల రంగం నుంచి మరో 9 సంస్థలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా రంగం నుంచి 7 కంపెనీలకు ఈ లిస్ట్ లో స్థానం ఉంది.

గత దశాబ్ధంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ ప్రథమ స్థానంలో నిలిచింది.హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా రంగం రూ.6900 కోట్ల నుంచి రూ.34,400 కోట్లకు వృద్ధి చెందగా, టెక్నాలజీ రూ.69,300 కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. అగ్రగామి 10 బ్రాండ్‌ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్‌ల వాటా 46 శాతంగా ఉంది.