Last Updated:

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాక్.. 27లక్షల అకౌంట్లపై నిషేధం

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాక్.. 27లక్షల అకౌంట్లపై నిషేధం

WhatsApp: ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.

ఫేక్‌ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో నకిలీ మరియు తప్పుడు ఖాతాలను మెటా సంస్థ బ్యాన్‌ చేసింది. అలాగే భారత ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను నిలిపివేసింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. వీటిలో 8 లక్షలకుపైగా అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే తొలగించినట్లు పేర్కొంది. కాగా ఈ మేరకు యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను భారత ఐటీ మంత్రిత్వ శాఖకు అందించింది.

అంతేకాకుండా సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా యూజర్ కంప్లైంట్ పై స్పందించడం, వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన కంటెంట్‌ను నివారించే క్రమంలో భాగంగా ఈ రకమైన చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది.

ఇదీ చదవండి ఎంత ఘోరం.. మందుబాబు ప్రాణం తీసిన “ఆమ్లెట్”

ఇవి కూడా చదవండి: