iQOO Z10x 5G Launched: అతిపెద్ద బ్యాటరీ.. iQOO Z10x 5G వచ్చేసింది.. ఆఫర్లు భలేగా ఉన్నాయి..!

iQOO Z10x 5G Launched: ఐకూ ఈరోజు రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ తన Z సిరీస్ కింద ఈ ఫోన్‌లను ప్రవేశపెట్టింది. అవును, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iQOO Z10 5G,iQOO Z10x 5G ఫోన్లు అధికారికంగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిలో, iQoo Z10x ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్. కొత్త iQOO Z10x ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
iQOO Z10x 5G Features
iQOO Z10x స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇది 2408 × 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1050 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.
మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీన్ని 4 నానోమీటర్ ఫాబ్రికేషన్లపై తయారుచేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15 పై నడుస్తుంది. గ్రాఫిక్స్ కోసం, ఈ ఫోన్‌లో మాలి G615 MC2 GPU కూడా ఉంది. ఈ మొబైల్‌లో 6జీబీ ర్యామ్ 128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
iQOO Z10x 5G Camera
iQoo Z10x 5G ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా (మాక్రో సెన్సార్) కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం మొబైల్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
iQOO Z10x 5G Battery
ఈ మొబైల్ 6,500mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి, 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. బడ్జెట్ విభాగంలో శక్తివంతమైన పనితీరు, పెద్ద డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్ గొప్ప ఎంపిక.
iQOO Z10x 5G Price
iQoo Z10x 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,499కి లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.14,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499కి లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై,మీరు ఎంపిక చేసిన ICICI, SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో రూ. 1000 క్యాష్‌బ్యాక్ పొందచ్చు. మీరు తక్షణ డిస్కౌంట్ పొందచ్చు.
iQOO Z10x 5G Offers
డిస్కౌంట్ తర్వాత, ఈ మొబైల్ చౌకగా లభిస్తుంది. రూ. 12,499, రూ. 13,999కి కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ మొదటిసారిగా ఏప్రిల్ 22న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఐకూ ఈ-స్టోర్ ద్వారా అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్ టైటానియం, అల్ట్రామెరైన్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- Oppo Find X8S Find X8S Plus Launch: ఒప్పో మాస్ జాతర.. రెండు కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్.. బ్యాటరీ, కెమెరా అల్లాడించేశాయ్..!