Last Updated:

Apple CEO: ‘చివరి అవకాశంగా మాత్రమే లేఆఫ్స్ పై ఆలోచిస్తాం’

గత త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 24.1 బిలియన్‌ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్‌ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువని కంపెనీ పేర్కొంది.

Apple CEO: ‘చివరి అవకాశంగా మాత్రమే లేఆఫ్స్ పై ఆలోచిస్తాం’

Apple CEO: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతలు విధిస్తున్నాయి. గత ఏడాది ప్రముఖ సోషల్ ప్లాట్ ఫామ్ తో ట్విటర్ తో ప్రారంభమైన లేఆఫ్స్.. ఆ తర్వాత దిగ్జన కంపెనీలైన అమెజాన్‌ , మైక్రోసాఫ్ట్ , గూగుల్ , మెటా లలో ఉద్యోగులను తొలగించాయి. కానీ, యాపిల్‌ సంస్థ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లేఆఫ్‌లు విధించలేదు. అయితే, తాజాగా యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ లేఆఫ్స్ పై స్పందించారు. తమకు అన్ని అవకాశాలు మూసుకుపోయిన పక్షంలో చివరి అంశంగా మాత్రమే లేఆఫ్‌ల గురించి ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

కోతలపై టిమ్ కుక్ ప్రకటన(Apple CEO)

కాగా, యాపిల్‌ కంపెనీ రిటైల్‌ విభాగంలో కొద్ది మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు ఇటీవల వెలువడ్డాయి. దీంతో ఉద్యోగుల్లో కోతలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో టిమ్‌ కుక్‌ ప్రకటన చేసిన ప్రకటనతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ తెలివిగా వ్యవహరిస్తుందని కుక్‌ తెలిపారు. ‘ప్రస్తుతం అంతా మాట్లాడుతున్నట్టుగా లేఆఫ్‌లు ఇప్పట్లో ఉండవక పోవచ్చు. కానీ, ఆ నిర్ణయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. నియామకాల ప్రక్రియను కూడా కొనసాగిస్తాం. అయితే, గతంలో కంటే తక్కువ స్థాయిలోనే ఉద్యోగ నియామకాలు ఉంటాయి. ప్రస్తుతం కంపెనీకి ఎదురయ్యే సవాళ్లను సరైన పద్ధతిలో ఎదుర్కొంటున్నాం. సంస్థపై ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించు కునేందుకు మాకు ఉన్న అన్నీ అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

 

ఐఫోన్ ఆదాయమే ఎక్కువ

గత త్రైమాసికంలో యాపిల్ కంపెనీ 24.1 బిలియన్‌ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్‌ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువని కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఐఫోన్ విక్రయాలు 1.5 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. మరోవైపు మాక్‌ కంప్యూటర్ల అమ్మకాల్లో గత త్రైమాసికం కంటే 30 శాతం క్షీణించడంతో పాటు యాపిల్ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ లాంటి వేరబుల్స్‌ అమ్మకాలు కూడా తగ్గాయని పేర్కొంది. దీంతో ఆ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడంపై దృష్టి పెట్టనున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే 90 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్ల బై బ్యాక్‌ను కూడా యాపిల్ ప్రకటించింది.