Zero Shadow Day : హైదరాబాద్ లో ముగిసిన అద్భుత ఘట్టం.. జీరో షాడో డే ఆవిష్కృతం
తాజాగా హైదరాబాద్‌లో అరుదైన సౌర వింత ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల నీడ కనిపించక పోవడాన్ని "జీరో షాడో డే"గా పిలుస్తారు. ఇప్పుడు భాగ్యనగరంలో ఈ అరుదైన ఘట్టం
Zero Shadow Day : తాజాగా హైదరాబాద్‌లో అరుదైన సౌర వింత ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల నీడ కనిపించక పోవడాన్ని “జీరో షాడో డే”గా పిలుస్తారు. ఇప్పుడు భాగ్యనగరంలో ఈ అరుదైన ఘట్టం జరగడం పట్ల నగర వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి, సూర్యుడి మధ్య రేఖను సౌరక్షీణత రేఖగా పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో ఏర్పడుతుంది.
ఈ అద్భుతం వెనక చాలా కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి రోజూ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇలా తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీది నుంచి వెళ్తూ.. సూర్యకిరణాలు 90 డిగ్రీల కోణంలో భూమ్మీద పడతాయి. ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు నీడ.. సరిగ్గా ఆ వస్తువు కిందే పడుతుంది. దీన్నే జీరో షాడో మూమెంట్ అని పిలుస్తారు. అలా అని రోజూ జీరో షాడో ఉండదంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడు ఓ నిర్ధిష్టమైన స్థానంలోకి వచ్చినప్పుడే జీరో షాడో డే వస్తుందని తెలిపారు.
కాగా..ఏప్రిల్ 25 (2023) ఇటువంటి అరుదైన ఘటనకు బెంగళూరు వేదికైంది. కోరమంగళంలో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ క్యాంపస్ లో ఓ ఈవెంట్ నిర్వహించి నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంట్లో భాగంగా సరిగ్గా మధ్యాహ్నం 12:17 గంటలకు ఎండలో నిటారుగా ఉన్న వస్తువులకు నీడ కనిపించలేదు. అలా ఒకటిన్నర నిమిషాల పాటు వారి నీడ వారికి కనిపించని అద్భుతం జరిగింది. 130 ఉత్తర అక్షాంశం వెండబి అన్ని ప్రదేశాలలో (మధ్యాహ్నా 12.17)సరిగ్గా తలపైకి సూర్యుడు చేరుకున్న సమయంలో నీడ అదృశ్యమవుతుందని తెలిపారు.