WhatsApp: 50 కోట్ల మంది వాట్సాప్ నెంబర్లు హ్యాక్
వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్‌న్యూస్’ వెల్లడించింది.
WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్‌న్యూస్’ వెల్లడించింది. 48.7 కోట్ల మంది ఫోన్ నంబర్లతో కూడిన 2022 డాటాబేస్‌ను విక్రయిస్తానంటూ ఆ వ్యక్తి హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరంలో ఓ ప్రకటనను పోస్టు చేసినట్టు తెలిపింది. ఇందులో భారతదేశ యూజర్ల నెంబర్లు కూడా ఉన్నాయి.
హ్యాక్ అయిన డేటాసెట్‌లో 61.62 లక్షల మంది భారతీయుల డేటాతో సహా 84 దేశాలకు చెందిన వాట్సాప్ యూజర్ డేటా ఉందని సైబర్‌న్యూస్ నివేదించింది.
హ్యాకర్ 3.2 కోట్ల యూజర్ రికార్డులను కలిగి ఉన్న యూఎస్ డేటాసెట్‌ను 7,000డాలర్లకి మరియు యూకే డేటాసెట్‌ను 1.1 కోట్ల నంబర్‌లతో 2,500డాలర్లకి విక్రయిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. మెసెంజర్ సర్వీస్ ప్రొవైడర్ క్లెయిమ్ చేసినట్లుగా చాట్‌లు ఎల్లప్పుడూ ఎన్‌క్రిప్ట్ చేయబడినప్పటికీ, వాట్సాప్‌లోని డేటా అంతగా రక్షించబడదు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని వాట్సాప్ వినియోగదారులకు సైబర్ న్యూస్ సూచించింది.
ఇదీ చదవండి: గూగుల్లో ఈ ఏడాది ఎక్కువ మంది వెతికింది ఈమెనే..!