Home / Telangana latest news
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఐటీ శాఖ మెరుపుదాడులు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై తెల్లవారు జామునుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
భార్యను కాపురానికి రప్పించాలనుకుని అనేక ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన ఓ భర్త బాంబు ఉందంటూ ఫేక్ కాల్తో అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చివరకి నిందితుడిని అరెస్ట్ చేసి 18 రోజులు జైలులో ఉంచారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కిన వీడియో వైరల్ గా మారింది.
తెలంగాణ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖలో 134 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల కాలంలో పలు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. రోజూ ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుమంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యాసంవత్సరంలోపు కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.