Home / Telangana latest news
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని అన్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇకపై వారు ఎంసెట్ కోచింగ్ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు. వేలకువేలు ఫీజులు చెల్లించాల్సిన పని కూడా లేదు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
హైదరాబాద్ నాగోల్ స్నేహాపురి కాలనీలోని మహదేవ్ జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
వైఎస్సార్టీపీకి వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ భయపడుతోందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలఅన్నారు . షర్మిల గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో నిరుద్యోగుల కల సాకారం కానుంది. వరుస పెట్టి నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఈ వార్తతో ఉద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని శిక్షలు విధించిన కామాంధులు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా పసి పిల్లలనుంచి పండు ముసలి వాళ్లపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రోజూ ఏదో ఒక మూల ఎంతోమంది బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.