Home / Telangana latest news
హైదరాబాద్లో వరుస చిన్నారుల మిస్సింగ్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మరువకముందే నగరంలో ఓ బాలుడు అదృశ్యమవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టడంతో 6 మంది సజీవ దహనం అయ్యారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ్టితో కరీంనగర్లో ముగియనుంది.
కేసీఆర్, కేటీఆర్ పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ మరుగుదొడ్డిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఏమయ్యాయి అంటూ ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు.
పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు.
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ట్రయల్ మాత్రమే.. అసలు కథ ముందుంది అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నిన్న కేసీఆర్ కూతురు కవితను సీబీఐ సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆ విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా ముగియలేదని పేర్కొంటూ సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చారు.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.