Last Updated:

Hyderabad: భార్య కాపురానికి రాలేదని.. బాంబు ఉందంటూ ఫేక్ కాల్.. చివరికి ఏమైందంటే..?

భార్యను కాపురానికి రప్పించాలనుకుని అనేక ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన ఓ భర్త బాంబు ఉందంటూ ఫేక్ కాల్‌తో అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చివరకి నిందితుడిని అరెస్ట్ చేసి 18 రోజులు జైలులో ఉంచారు.

Hyderabad: భార్య కాపురానికి రాలేదని.. బాంబు ఉందంటూ ఫేక్ కాల్.. చివరికి ఏమైందంటే..?

Hyderabad: భర్త తీరుతో విసిగిపోయిన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను ఎలాగైనా తిరిగి కాపురానికి తీసుకురావలి పలు ప్రయత్నాలు చేసిన అతడు విఫలమయ్యాడు పోలీసులను ఆశ్రయించి తన భార్యను కాపురానికి రప్పించాలనుకుని ఫెయిల్ అయ్యాడు. కాగా పోలీసులపై ఆగ్రహంతో ఓ ప్లాన్ వేచేశాడు. బాంబు ఉందంటూ ఫేక్ కాల్‌తో అర్ధరాత్రి రక్షకభటులను పరుగులు పెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చివరకి నిందితుడిని అరెస్ట్ చేసి 18 రోజులు జైలులో ఉంచారు.

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట రియాసత్‌నగర్‌ డివిజన్‌ రాజనర్సింహనగర్‌కు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ఖాన్‌ అనే వ్యక్తి జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అక్బర్ ఖాన్ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల తగాదాలు కాస్త ముదిరి భర్త తీరుతో విసిపోయిన భార్య పిల్లలను తీసుకుని భార్య చౌటుప్పల్‌లో ఉంటున్న తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. కాపురానికి పంపాలని పలుమార్లు కోరినా ఆమె తన భర్తతో వెల్లేందుకు సుముఖత కనపర్చలేదు చౌటుప్పల్‌ పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు అక్బర్ ఖాన్ అయిన ఫలితం లేకపోయింది.

దీనితో ఆగ్రహానికి గురైన అక్బర్ ఖాన్ మంగళవారం రాత్రి ఐఎస్‌సదన్‌ కూడలిలో మందిర్‌-మసీదు వద్ద బాంబు ఉందని డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు వచ్చి అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. కాగా అది ఫేక్ కాల్ అని తేలడంతో కాల్‌ ట్రాక్‌ ద్వారా ఫోన్‌ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుసుకుని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాంపల్లి ఏడో స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో అతడిని హాజరుపర్చగా 18 రోజుల జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి లక్ష్మణ్‌రావు తీర్పు వెల్లడించారు.

ఇదీ చదవండి: వైసీపీకి షాక్.. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

ఇవి కూడా చదవండి: