Home / Telangana latest news
ఒకరు బిర్యానీ కోసం ఒకరు పాతబస్తీలో హల్చల్ చేశారనుకోండి. ఇదెక్కడి దాకా వెళ్లిందంటే బిర్యానీ కోసం ఆ సమయంలో తెలంగాణ హోంమంత్రికే ఫోన్ చేసేశారు. మరి ఎందుకు ఇలా చెయ్యాల్సి వచ్చిందో ఓ సారి ఈ కథనం చూసెయ్యండి.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి సెప్టెంబర్ 26వ సోమవారం నుంచే అధికారికంగా అమల్లోకి వస్తాయంటూ సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు.
ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారు గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ దారుణం జరిగింది. వివాహితపై సామూహిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు కవల పిల్లలు మరణించారు.
టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్‌లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి ఆయన వెళ్లారు. ఇటీవలే ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందారు. కాగా వారి ఇంటికి వెళ్లి మల్లయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.