Last Updated:

Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖలో 134 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖలో 134 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన ఈ పోస్టుల్లో డైట్ లో సీనియర్ లెక్చరర్ల ఉద్యోగాలు 23, వివిధ విభాగాల వారీగా డైట్ లో 65 పోస్టులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు గ్రేడ్ -1 పోస్టులు 24, ఎస్సీఈఆర్టీ విభాగంలో 22 లెక్చరర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 91 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈ ఏడాది మార్చిలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 80 వేల పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఇక ఈ పోస్టుల భర్తీపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మేం మాటలు చెప్పం. చేతల్లో చూపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అని ట్వీట్‌ చేశారు.

ఈ మేరకు శుక్రవారం నాడు వైద్యారోగ్యశాఖపై మంత్రి హరీశ్ రావు శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా మొత్తం 7 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటిలో 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 6 వేలకు పైగా నర్సు పోస్టులతోపాటు 1569 పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమించనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.

ఇదీ చదవండి: అయ్యప్ప పూజకని వెళ్లి.. ఐదుగురు దుర్మరణం

 

ఇవి కూడా చదవండి: