Home / Telangana latest news
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఏపీలో మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలబడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనాని ఛలో కొండగట్టు లో భాగంగా జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వారితో చర్చించారు. తెలంగాణలోనూ జనసేన పోటీ భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. […]
Smita Sabharwal: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అర్థరాత్రి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేయనున్నారు. అదే విధంగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు నిఘా వర్గాలు […]
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహి ఏపీలో దూసుకుపోవడానికి సిద్ధమైంది. తాజాగా ఛలో కొండగట్టుకు సంబంధించిన ప్రోమోను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
Revanth Reddy: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్ చొరబడటంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) స్పందించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్మితా సబర్వాల్ సంఘటన అద్దం పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శికే రక్షణ లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమమ్ పాలిటిక్స్ ‘ సీఎం కార్యదర్శి ప్రాణాలకే […]