Last Updated:

Kavitha phone Seized: కవిత పర్సనల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.

Kavitha phone Seized: కవిత పర్సనల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ

Kavitha phone Seized: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.

దీంతో తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ రాజకీయాలు హాట్ ఎక్కాయి. కవితకు మద్ధతుగా ఆమె సోదరుడు, రాష్ట్రమంత్రి కేటీఆర్ , మరో మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

వారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.

 

కవిత ఫోన్ సీజ్(Kavitha phone Seized)

కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించారు.

దీంతో విచారణ గది నుంచి బయటకొచ్చిన కవిత.. తన వ్యక్తిగత సిబ్బంది దగ్గరున్న ఫోన్‌ను ఈడీ అధికారులకు అప్పగించారు.

దానికంటే ముందే ఇంటి వద్ద ఉన్న కవిత మరో ఫోన్‌ను సెక్యూరిటీతో ఈడీ అధికారులు తెప్పించారు. దీంతో కవిత ఫోన్‌లో ఉన్న డేటాను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు.

కాగా, కవిత వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారనేది కవితపై మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

అసలు కవిత ఎన్ని ఫోన్లు వాడింది? ఎందుకు ధ్వంసం చేశారనే విషయంపై ఈడీ దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తున్నారు.

ఇంటి నుంచి తెప్పించిన ఫోన్ లోని కాల్ డేటాను, వాట్సాప్ చాటింగ్ ను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం.

శనివారం రాత్రి 8 గంటల వరకు విచారణ జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే విధంగా ఆదివారం కూడా విచారణ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

కవిత విచారణకు 5 నిమిషాల బ్రేక్

కాగా ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత.

ఢిల్లీ ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది.

జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై విచారణ జరుగుతోంది.

ఆరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్టు, ఆడిటర్‌ బుచ్చిబాబు వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా కవితను విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

కవిత విచారణకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. దీంతో విచారణ గది నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ లోపలికి వెళ్లారు.

ఈ లిక్కర్ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆరోపించారు.

దర్యాప్తు సంస్థలకు కేసీఆర్, సోనియా ఎవరైనా ఒక్కటేనన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు.