Last Updated:

Vasanta Panchami: వైభవంగా వసంత పంచమి వేడుకలు.. బాసరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Vasanta Panchami: వైభవంగా వసంత పంచమి వేడుకలు..  బాసరలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Vasanta Panchami: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

వసంత పంచమి(Vasanta Panchami) ఉత్సవాలను సందర్భంగా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది.

ఆలయ గోపురాలు, ఆవరణ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. గురువారం వసంత పంచమి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సరస్వతీ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కాగా ఈరోజు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించడానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.

ఉదయం గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

దీని కోసం ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి ఏటా వసంత పంచమి రోజున భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనం అర్థరాత్రి నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్ల లో బారులు తీరారు.

వర్గల్‌లో పంచమి వేడుకలు

మరో వైపు వర్గల్‌ విద్యాధరి క్షేత్రం లో ఘనంగా వసంత పంచమి(Vasanta Panchami) వేడుకలను నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా క్షేత్రంలోని ఆలయాలు విద్యుద్దీపాలతో అలంకరించారు.

విద్యాధరి క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆలయం వద్ద అక్షరాభ్యాసం కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌ ద్వారా చేసుకునే విధంగా ప్రత్యేక మంటపాలను ఏర్పాటు చేశారు.

భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

 

పంచమికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

వసంత పంచమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఈ పర్వదినం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని ఉంచుకుని బాసర, వర్గల్ కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. మొత్తంగా 108 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

వాటిలో నిర్మల్ జిల్లాలోని బాసరకు 88 ప్రత్యేక బస్సులు, సిద్దిపేట జిల్లా వర్గల్ కు 20 ప్రత్యేక బస్సులను నడపుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/