Home / technology news
దేశీయ ట్విట్టర్ గా పేరుగాంచిన కూ యాప్ ఇప్పుడు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఉదాహరణగా భారతీయ బహుభాషా మైక్రోబ్లాగింగ్ మరియు సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ఇటీవలే బ్రెజిల్లో ప్రారంభించబడింది. బ్రెజిల్లో ప్రారంభించిన 48 గంటల్లో, యాప్ 1 మిలియన్ యూజర్ డౌన్లోడ్లు సొంతం చేసుకుంది.
మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కాగా ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.
ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు, నవంబర్ 21 వరకు కంపెనీ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడినందునట్విట్టర్ మునిగిపోయే నౌకగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
శుక్రవారం జారీ చేసిన ముసాయిదా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం జరిమానా మొత్తాన్ని రూ.500 కోట్ల వరకు పెంచింది.
ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.
దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది.
ఐఫోన్ 15లో యాపిల్ భారీ అప్గ్రేడ్లు చేపట్టనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. రానున్న ఐఫోన్ 15 న్యూ బయోనిక్ ఏ17 బయోనిక్ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. ఐఫోన్ 15 మోడల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ వాడేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తుంది.
జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్.. ఇకపై జీమెయిల్ వినియోగదారులంతా కొత్త జీమెయిల్ డిజైన్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని గూగుల్ పేర్కొనింది. ఈనెల నుంచి గూగుల్ కొత్త జీమెయిల్ యూజర్ ఇంటర్ఫేస్ను అందుబాటులోకి వచ్చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.