Last Updated:

Most Desired Brands Of India 2022: సత్తా చాటిన జియో.. మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ గా గుర్తింపు

దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది.

Most Desired Brands Of India 2022: సత్తా చాటిన జియో.. మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ గా గుర్తింపు

Most Desired Brands Of India 2022:  దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. ‘ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022’ పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. దీనిలో బ్రాండ్ పటిష్టత ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. దీనిలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కంటే జియో ముందుందని టీఆర్ఏ ఈ నివేదికలో వివరించింది.

భారతదేశం ఎక్కువగా కోరుకునే బ్రాండ్లు (ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్- 2022) లిస్ట్ ఇదే

  • టెలికాం విభాగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి.
  • దుస్తులు విభాగంలో అడిడాస్ తొలి స్థానంలో ఉంది. తర్వాత నైక్, రేమండ్, అలెన్ సోలీ మరియు పీటర్ ఇంగ్లాండ్ ఉన్నాయి.
  • ఆటోమొబైల్ జాబితాలో బీఎండబ్ల్యూ మెుదటి స్థానంలో ఉంది. తరువాత టయోటా, హ్యుందాయ్ మరియు హోండా ఉన్నాయి.
  • బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల సూచికలో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ స్థానంలో, ICICI బ్యాంక్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి.
  • వినియోగదారు ఉపకరణాల ర్యాంకింగ్‌లో కెంట్ అగ్రస్థానంలో ఉండగా, లివ్‌పుర్ మరియు ఒకాయ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో ఎల్జీ, సోని, శామ్ సంగ్ మొదటి మూడు బ్రాండ్‌లుగా ఉన్నాయి.
  • భిన్న రంగాల్లో విస్తరించిన గ్రూపుల్లో ఐటీసీ అగ్రస్థానం పొందగా, టాటా, రిలయన్స్‌ తదుపరి నిలిచాయని విశ్లేషించింది.
  • ఇంధన విభాగంలో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌, అదానీ గ్రూప్‌లు వరుస అగ్రస్థానాల్లో నిలిచాయి.
  •  ఆహార పానీయాల రంగంలో ఆముల్‌ అగ్రస్థానం పొందగా, రెండోస్థానంలో నెస్‌కెఫే ఉంది.
  • ఎఫ్‌ఎంసీజీలో ఫాగ్‌ తొలిస్థానంలో ఉంటే, లాక్‌మి, నీవియా, కోల్గేట్‌ తరవాత స్థానాల్లో ఉన్నాయి.
  • అత్యంత వేగంగా కొనుగోళ్లు జరిగే విద్యుత్తు ఉత్పత్తుల్లో ఫిలిప్స్‌,
  • గాడ్జెట్‌లలో ఎంఐ
  • ఆరోగ్య సంరక్షణలో హిమాలయ
  • ఆతిథ్యంలో ఐటీసీ హోటల్స్‌
  • తయారీలో ఏసీసీ
  • రిటైల్‌లో కేఎఫ్‌సీ
  • టెక్నాలజీ విభాగంలో డెల్‌ అగ్రస్థానాలు పొందినట్లు నివేదిక వివరించింది.
  • ఇంటర్నెట్‌ బ్రాండ్లకు వస్తే అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఫ్లిప్‌కార్ట్‌, గూగుల్‌ ముందున్నట్లు నివేదకలో వెల్లడించింది.

ఇదీ చదవండి: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాక్.. 4400 మంది తొలగింపు

ఇవి కూడా చదవండి: