Home / technology news
మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మెసేజ్‌లను పంపడం లేదా స్వీకరించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో Meta కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని గుర్తించాం.
భారత అంతరిక్ష పరిశోదన సంస్ధ ఇస్రో సరికొత్త మైలురాయిని అందుకోబోతుంది. ఒక రాకెట్ ద్వారా 6టన్నుల ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనతను చేజిక్కించుకోబోతుంది. అందుకు వేదికగా తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం సిద్ధమైంది. నేటి అర్ధరాత్రి 12.07 నిమిషాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 – ఎం2 (ఎల్ఏఎం3) రాకెట్ ను ఇస్రో నింగిలోకి పంపనుంది.
అమెరికా ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో ఈ అతిపెద్ద కెమెరాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు.
ఈ నెల 20వ చైనీస్ మార్కెట్లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్సైట్లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
మోటో ఈ22ఎస్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని మోటో ట్విట్టర్ అకౌంటు ద్వారా అధికారికంగా మోటోరోలా వెల్లడించింది.
ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో వయస్సు వెరిఫికేషన్ చేసే ఫీచర్ 2022 జూన్‌లో అమెరికాలో మొదటిసారి అమలులోకి వచ్చింది.యూజర్లు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం లేదా ఫోటో ఐడీని అప్లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును కూడా ధృవీకరించాలి.18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పుట్టిన తేదీని మార్చడానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే ఈ వెరీఫికేషన్ చేయాలిసిందే.
చార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్‌కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్‌లో విధిగా చార్జర్‌ను జోడించాలని యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.
గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ యూజర్లకు శుభవార్త. ఇకపై మీ గూగుల్ అకౌంట్లను పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అవ్వొచ్చు. గూగుల్ యూజర్లకు అదనపు సెక్యూరిటీ అందించేందుకు ఆండ్రాయిడ్ డివైజ్‌లు క్రోమ్ కోసం కొత్త పాస్కీ అనే ఫీచర్‌ను రిలీజ్ చేసింది.
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్‌తో డిఫరెంట్ ప్లాన్స్‌ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.