Home / PM Modi
AP CM Chandrababu Naidu : చరిత్రలో ఇవాళ కీలకమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పున:నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను చాలాసార్లు ప్రధాని మోదీని కలిశానని, నిమిషాల కొద్ది మాట్లాడినట్లు గుర్తుచేశారు. కానీ, మొన్న కలిసినప్పుడు మోదీ కళ్లలో ఆవేదన చూశానని చెప్పారు. ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోయాయనే బాధ మోదీలో కనిపించిందన్నారు. మేమంతా మీతో ఉన్నామని ప్రధానికి సీఎం భరోసా ఇచ్చాడు. ఉగ్రదాడి విషయంలో ఏ […]
Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో […]
PM Modi : రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, […]
Amaravati: అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు బస్సులు బయలుదేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 3400 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరవనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కూటమి నేతలు, అభిమానులు తరలివస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో మార్గాలు మార్మోగుతున్నాయి . అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి హాజరయ్యేలా 8 రూట్లు […]
Amaravati: ప్రధాని మోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 సెక్టార్లుగా విభజించారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు భద్రతా విధుల్లో ఉన్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి అమరావతికి రోడ్డుమార్గంలో వెళ్లనున్నారు. గన్నవరం నుంచి అమరావతి రోడ్డు మార్గంలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజధాని కల […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన సమారుగా గంటా పదిహేను నిమషాల పాటు ఉంటుంది.కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. […]
AP Police restrictions : ఏపీలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఈ నెల 2న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అమరావతి పరిధిలో ఎగరవేతపై నిషేధం విధించారు. ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రేపు ఏపీ ప్రధాని రాక.. ప్రధాని మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణ పనులను పున: ప్రారంభించనున్నారు. సుమారు రూ.58 వేల కోట్ల అమరావతి ప్రాజెక్టుకు శంకుస్థాపనం, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. […]
AP Congress: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆమె నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా అమరావతి రాజధాని పునఃప్రారంభంతోపాటు పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే2న ఏపీకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. గతంలో 2015లో ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాని మోదీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన […]
Russia tour: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. కాగా పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం వాణిజ్య, దౌత్య పరంగా పలు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. మరోవైపు […]
Union Cabinet Meeting Chaired by PM Modi Today: ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ జరగనుంది. వారంరోజుల వ్యవధిలో రెండోసారి సీసీఎస్ భేటీ కానుంది. ప్రధానితో మీటింగ్లో హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థికశాఖ మంత్రులు హాజరుకానున్నారు. కాగా, ప్రతి దాడులపై భారత సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత సైనికుల శక్తిసామర్థ్యాలపై పూర్తి భరోసా కల్పించారు. ఢిల్లీలో ఇవాళ నాలుగు కీలక […]