Home / PM Modi
PM Modi Meets Party Leaders From Southern State: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని తన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశం ఫొటోలతో మోడీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు పెట్టారు. […]
PM Modi to Visit Visakha on Nov 29 Lay Stone For Green Hydrogen Hub: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలపెట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయటంతో బాటు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన విశాఖ ఆంధ్రాయూనివర్సిటిలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదీ […]
PM Modi to be conferred by Guyana, Barbados top awards: ప్రధాని నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆయనకు గయానా, డొమినికా దేశాల నుంచి అత్యున్నత పురస్కారం అందించాయి. ఈ మేరకు డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్.. ప్రధాని నరేంద్ర మోదీని ‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత నరేంద్ర మోదీ గయానా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే రెండు పురస్కారలను అందుకున్నారు. ‘డొమినికా అవార్డ్ ఆఫ్ […]
PM Modi congratulates Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హోరాహోరీ పోరులో ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘ హృదయపూర్వక అభినందనలు మిత్రమా’ అని ట్వీట్ చేశారు. ఈ విజయం అనంతరం భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి భవిష్యత్ లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని నరేంద్ర […]
ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలత కూడిన వినతిపత్రాన్ని సమర్పించి తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రధానిని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయి అరగంటపాటు చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం మద్దతును కోరారు
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యునిగా మోదీ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.వరుసగా మూడవసారి ఎన్డీఏ కూటమి గెలిచి కేంద్రంలో అధికారం చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపధ్యంలో మోదీ, మంత్రులు ఈ నెల జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసారు.