Home / PM Modi
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.
జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదని అన్నారు
లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే అవకాశాల్లేవని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖనోజ్లో ఆయన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
మోదీ మరలా అధికారంలోకి వస్తే వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశముందని అంటూ రాహుల్ గాంధీ అన్నారు .. .ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నాడు తెలంగాణ పర్యటనలో రాహుల్‌గాంధీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రోజు అదానీ.. అంబానీ.. అంబానీ..అదానీ అంటూ విమర్శించే రాహుల్ ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు కూడా వీరి నుంచి టెంపోల్లో నోట్ల కట్టలు ముట్టినందుకు మౌనం పాటిస్తున్నారా అని నిలదీశారు
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సారి అధికారంలోకి వస్తే.. ఏడాదికి ఒక ప్రదానిని తీసుకువస్తారని అన్నారు. ఐదు సంవత్సారాలలో ఐదు మంది ప్రధానలు మారుతారు . అంటే దేశ ప్రగతిని అధోగతి పాలు చేయబోతున్నారని ప్రధాని విమర్శించారు. వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని ప్రధాని మోదీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీని వెనక్కు వెళ్లేలా చేసిందని.. గతంలో చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన కూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.