Home / national
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత బిశ్వశర్మ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలేసి పురుషులనే టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. […]
Congress leader and MP Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడితో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతిచెందగా, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ వినయ్ నివాసానికి వెళ్లి రాహుల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. హర్యానాకు చెందిన వినయ్ హిమన్షి పెళ్లి ఏప్రిల్ 16న జరుగగా, 19వ తేదీన విందు ఏర్పాటు చేశారు. అనంతరం అతడు భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్‌కు హనీమూన్‌కు వెళ్లారు. ముందు యూరప్ వెళ్లాలని […]
Kohinoor : బ్రిటన్ మహారాణి ధరించిన కోహినూర్ వజ్రం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖల మంత్రి లీసా నాండీ బదులు ఇచ్చారు. ఇండియా, బ్రిటన్ రెండు దేశాల మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అనుకున్నట్లు జరిగితే మంచి నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఇండియా సాంస్కృతిక శాఖ […]
CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్‌లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్‌ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి […]
Famous yoga guru Sivananda Swami : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. స్వామి శివానంద ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌లో చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఆర్సీబీ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో ఎన్గిడిని జట్టులోకి తీసుకుంది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తున్నది. ఈ సీజన్లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో […]
Sri Lankan flight departing from Chennai to Colombo : చెన్నై నుంచి కొలంబోకు బయలుదేరిన శ్రీలంక విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు ఈమెయిల్ అందింది. వెంటనే చెన్నై విమానాశ్రయం అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో శ్రీలంకను అలర్టు చేశారు. కొలంబో చేరుకున్న విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. శనివారం ఉదయం 11.5 గంటలకు చెన్నై విమానాశ్రయం చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఈమెయిల్ వచ్చింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లే శ్రీలంక […]
Tejashwi Yadav welcomes the announcement made by the Center : వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చుతామని కేంద్రం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో మంచి మార్పును తీసుకొచ్చే క్షణమని లేఖలో పేర్కొన్నారు. కులగణన కేవంల డేటా కాదని, అనేక మంది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని రాసుకొచ్చారు. సర్వేను […]
India-Pakistan : పాక్‌కు భారత్ మరో షాక్‌నిచ్చింది. ఆ దేశం నుంచి దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భారత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాక్ నుంచి ఇండియాకు రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాక్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చే అన్నిరకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నామని […]
Karnataka Chief Minister Siddaramaiah : నాకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. స్పీకర్ యుటి ఖాదర్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిందంటూ విలేకరుల ప్రశ్నకు ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించారు. అవును.. తనకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఏం చేయాలి..? పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని వెంటనే గుర్తించి వారిపై […]