Home / national news
తాను బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఎత్తేస్తామని బీజేపీ నుంచి తనకు సందేశం వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే బీజేపీలో చేరడం కంటే తన తల నరుక్కుంటానని ఆయన అన్నారు.
మిజోరాం సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే వైద్యుడి పై దాడి చేసింది. అపాయింట్ మెంట్ లేకుండా క్లీనిక్ లోనికి అనుమతి లేదని చెప్పడంతో ఓ వైద్యుడి పై తన ప్రతాపం చూపించింది. విచక్షణ కోల్పోయిన వైద్యుడి పై దాడికి దిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
మాఫియా నేత ముఖ్తార్ అన్సారీ మరియు అతని సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో100 బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ గురువారం దాడులు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించగా 13 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు
జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
తాను భారత సైన్యంలో చేరాలనుకున్నానని, అయితే కుటుంబ కారణాల వల్ల కుదరలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అస్సాం రైఫిల్స్ మరియు భారత సైన్యంలోని 57వ మౌంటైన్ డివిజన్ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను కూడా సైన్యంలో చేరాలని కోరుకున్నాను.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాల పంపిణీకి ఉపయోగించే డ్రోన్‌ను అడ్డగించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం కూడా ఆయుధంగా మారుతుందని, అమృత్ సర్‌కు చెందిన అబ్లు రాజేష్ అనే యువకుడు నిరూపించారు. తన రెండు కాళ్లూ లేకపోయినా, స్ర్పింగ్ కాళ్లతో డ్యా్న్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది.