Home / national news
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా భద్రతా ఉల్లంఘనకు ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ఫీ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ కోరుతూ "లాయర్స్ వాయిస్" అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
పెగాసస్ స్నూప్‌గేట్ వివాదానికి సంబంధించి సాంకేతిక కమిటీ పరిశీలించిన 29 మొబైల్ పరికరాల్లో దేనిలోనూ రుజువు కనుగొనబడలేదని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం దీని పై పలు పిటిషన్లను విచారించింది.
బీహార్ లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్ కుమార్ విజయం సాధించారు. అయితే విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
కుక్కలను ప్రేమించే వారు, ఇష్టపడని వారు తక్కువే. ఎందుకంటే కుక్క విశ్వాసపాత్రమైన జంతువు. అందుకు పలువురు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరి గుజరాత్ లోని ఒక గ్రామంలో అయితే వీధి కుక్కలకు కోట్లాది రూపాయల భూమిని కేటాయించి మరీ సాకుతున్నారు.
మహమ్మదీయ చట్టం ప్రకారం, యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పటికీ తన జీవిత భాగస్వామితో నివసించే హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఆమె వెంట ఉంటారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ మంగళవారం తెలిపారు.
జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో దాడులు చేసింది. రాంచీ, బీహార్, తమిళనాడు మరియు జాతీయ రాజధాని ప్రాంతంలోని అశోక్ నగర్ మరియు హర్ము ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.
తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన రెండు వారాల తర్వాత బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ.. తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ, తాను పక్షపాతం చూపనని అన్నారు.
టొమాటో ఫ్లూ అనే కొత్త జ్వరం కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలోవ్యాధికి చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులు లేవని చెప్పిన కేంద్రం మంగళవారం నివారణ చర్యలను అనుసరించాలని రాష్ట్రాలను కోరింది. టొమాటో ఫ్లూ అని పిలవబడే హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్
బీహార్‌లో లాలూ ప్రసాద్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిలాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు సునీల్ సింగ్‌తో సహా ఆర్జేడీ నేతలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది.