Home / national news
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ఉచిత ప్రకటనలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు, ఆ అంశాన్ని శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి నివేదించింది. విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం "ఎన్నికల ప్రజాస్వామ్యంలో, నిజమైన అధికారం
మేఘాలయ ప్రభుత్వం తాజాగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు విషయాన్ని మేఘాలయ ట్యాక్సేషన్ మంత్రి జేమ్స్ పీకే సంగ్మా ప్రకటించారు. ప్రస్తుతం పెట్రోల్ పై పన్నును లీటరుకు రూ.12.50కు లేదా 13.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దీనిపై తనకు ఎన్నికల సంఘం పంపిన నివేదికను త్వరలో ప్రకటించనున్నారు. గురువారం ఉదయం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో జార్ఖండ్ రాజ్ భవన్‌కు పంపగా, బైస్ కాసేపట్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులకు ఈ-పాస్‌పోర్ట్‌లను ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే 6 నెలల్లో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తామని విదేశీ వ్యవహారాల కార్యదర్శి (కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా & ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్)
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా భద్రతా ఉల్లంఘనకు ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ఫీ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ కోరుతూ "లాయర్స్ వాయిస్" అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
పెగాసస్ స్నూప్‌గేట్ వివాదానికి సంబంధించి సాంకేతిక కమిటీ పరిశీలించిన 29 మొబైల్ పరికరాల్లో దేనిలోనూ రుజువు కనుగొనబడలేదని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం దీని పై పలు పిటిషన్లను విచారించింది.
బీహార్ లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్ కుమార్ విజయం సాధించారు. అయితే విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.
కుక్కలను ప్రేమించే వారు, ఇష్టపడని వారు తక్కువే. ఎందుకంటే కుక్క విశ్వాసపాత్రమైన జంతువు. అందుకు పలువురు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరి గుజరాత్ లోని ఒక గ్రామంలో అయితే వీధి కుక్కలకు కోట్లాది రూపాయల భూమిని కేటాయించి మరీ సాకుతున్నారు.
మహమ్మదీయ చట్టం ప్రకారం, యుక్తవయస్సు వచ్చిన మైనర్ బాలిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వివాహం చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నప్పటికీ తన జీవిత భాగస్వామితో నివసించే హక్కును కలిగి ఉంటుందని తెలిపింది.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఆమె వెంట ఉంటారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ మంగళవారం తెలిపారు.