Last Updated:

Electricity Purchase from DISCOM: తెలుగు రాష్ట్రాలకు కరెంటు షాక్

కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది.

Electricity Purchase from DISCOM: తెలుగు రాష్ట్రాలకు కరెంటు షాక్

New Delhi: కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది. వీటిలో ఏపీకి చెందిన ఎస్పీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌ కూడా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు రూ.17,060 కోట్ల మేర బకాయిలు చెల్లించనందున, ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్‌) ద్వారా మార్కెట్‌ నుంచి కరెంటు కొనుగోలు చేసేందుకు వీల్లేదని నోటీసులో కేంద్రం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారంగా తెలంగాణ రూ. 1380 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు, రాజస్థాన్ రూ.500, జమ్మూ కాశ్మీర్ రూ. 434కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 412 కోట్లు ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్చేంజ్ కి బకాయిలున్నాయి. మహారాష్ట్ర 381, చత్తీస్ ఘడ్ రూ. 274కోట్లు,, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు,జార్ఖండ్ రూ.218 కోట్లు, బీహార్ రూ. 112 కోట్లు బకాయి పడ్డాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్చేంజ్ బోర్డు నుండి విద్యుత్ కొనుగోలు చేసినా కూడా దానికి సంబంధించిన బకాయిలను చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజులు దాటినా కూడా దీనికి సంబంధించిన డబ్బులను చెల్లించకపోవడంతో కేంద్ర విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.

ఇవి కూడా చదవండి: