Home / latest Telangana news
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని.. సీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Amit shah: తెలంగాణలోని చేవెళ్ల లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ తలపెట్టింది . ఈ సభకు రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వి కలలు మాత్రమే(Amit shah) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు.. కానీ, […]
ఢిల్లీ నుంచి పులి వేటాడం, వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి అమిత్ షా అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపైనే తిప్పారు.
కేసీఆర్, కేటీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తే.. నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో ఉంచారు
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీల్లో దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ పిల్లలను అధికారులు రక్షించారు. ఆర్పీఎఫ్, శిశు సంక్షేమశాఖ అధికారులు గురువారం సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాయి.
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల (సికెడి) రోగులకు ఖరీదైన డయాలసిస్ సౌకర్యాలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడానికి, తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డయాలసిస్ సౌకర్యాల సంఖ్యను మూడు నుండి 102 కు పెంచిందని ఆరోగ్య మంత్రి టి హరీష్ రావు తెలిపారు.
కేసీఆర్ మనవడు కేటీఆర్ కొడుకు హిమాన్ష్ రావు, బండ్ల గణేష్ కొడుకులిద్దరూ గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యేయేషన్ పట్టాను పొందారు. ఇక హిమాన్ష్ కోసం కేటీఆర్, కేసీఆర్ సతీసమేతంగా కనిపించారు. హిమాన్ష్ తన తాత కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అలాగే బండ్లగణేశ్ కుటుంబ సమేతంగా తన కొడుకుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
గత నెలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకొని నేడు హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్ కు ఆనుకుని ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాల్లో ఇదే ఎత్తైనది కావడం విశేషం.