Home / latest Telangana news
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
పంటలపై తెగుళ్ల నియంత్రణకు రైతులు పిచికారీ చేసే ‘షార్ప్’(బ్యాచ్-ఎస్0264) రసాయనిక పురుగుమందుపై తెలంగాణ వ్యవసాయశాఖ నిషేధం విధించింది. ఆ మందు నాసిరకం అని తేలడంతో అమ్మకాలు, వినియోగంపై ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కన్న కొడుకును చంపించేందుకు తల్లిదండ్రులే సుపారీ ఇచ్చిన ఘటన హుజూర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన కొడుకు తీరు, ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని భావించారో ఏమో కానీ సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.
మునుగోడు ఉపఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వైరం రోజురోజుకు అగ్గిమీద గుగ్గిళంలా తయారవుతోంది. కాగా తాజాగా బైపోల్ ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలంలోని పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
త్యం ఉరుకుల పరుగుల జీవితం సాగించే హైదరాబాద్ ప్రజలు చాలా మంది మెట్రోపై ఆధారిపై ఉంటారు. తక్కువ ధరకు అతితక్కువ సమయంలో ట్రాఫిక్ ఆటంకం లేకుండా చాలా మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే తాజాగా ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది మెట్రో యాజమాన్యం. త్వరలోనే మెట్రోరైలు చార్జీలను పెంచనుంది.