Home / latest Telangana news
హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో నగరం లోని పలు ప్రాంతాలు జలమయం అవ్వగా.. ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఫిలిం నగర్, ఏఎస్ రావు నగర్
: బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోండి.. మళ్లీ గెలవండని అన్నారు.
బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ని హన్మకొండ కోర్టు డిస్మిస్ చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతోవిబేధించిన మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ని తోసిపుచ్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణకి సహకరించడం లేదని పిపి వాదించారు.
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడం గమనార్హం.
ప్రయాణికుల రద్దీ అనుగుణంగా అమీర్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ రైళ్లను నడుపుతారు.
Minister KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. గొల్డెన్ తెలంగాణ నమూనాను దేశానికి పరిచయం చేయడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని ఆయన చెప్పారు. అంతేతప్ప ఇది గోల్మాల్ గుజరాత్ కాదని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మారిందే తప్ప డీఎన్ఏ, జెండా, అజెండా ఏం మారలేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని.. సీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Amit shah: తెలంగాణలోని చేవెళ్ల లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ తలపెట్టింది . ఈ సభకు రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వి కలలు మాత్రమే(Amit shah) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు.. కానీ, […]
ఢిల్లీ నుంచి పులి వేటాడం, వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి అమిత్ షా అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపైనే తిప్పారు.