Home / Latest News
పుదుచ్చేరిలో అంధకారం అలముకుంది. సామాన్య ప్రజల ఇళ్లకు కరెంట్ పోతే ఓకే. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఇళ్లు, కార్యాలయాలకే పవర్ కట్ అయ్యిందంటే అక్కడ విద్యుత్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అదేంటి కేంద్రపాలిత ప్రాంతంలో పవర్ కట్ సమస్యేంటీ అనుకుంటున్నారు కదా. ఇది విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగ వల్ల ఏర్పడిన కోతలు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ. ఇకపోతే ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మను చేసి పూజిస్తారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబి, గుమ్మడిపూలతో బతుకమ్మను పేర్చుతారు. ఈ రోజు ప్రసాదంగా అమ్మవారికి వెన్నముద్దలను చేసి వాయనంగా పంచిపెడతారు.
సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వ వార్షిక పరిశుభ్రత సర్వే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’ ఫలితాలు శనివారం ప్రకటించారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్ వద్ద ఉన్న ఎరిక్సన్ స్టాల్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఐరోపాలోని స్వీడన్లో కారును నడిపారు
వైసీపీ నేతలు తెలంగాణపై ఎందుకు విషం చిమ్ముతున్నారని తెలంగాణమంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. గ్యాస్ బండ ధరను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. అది కూడా వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొనింది.
చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.
వయసు మళ్లిన వారికి మాత్రమే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చాలా మంది భ్రమిస్తుంటారు. కానీ ఇటీవలే గుండె పోటుతో మరణించిన సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, రాజు శ్రీవాస్తవ, బ్రహ్మ స్వరూప్ మిశ్రా వంటి ప్రముఖులు దాన్ని అవాస్తవమని నిరూపించారు. మరి గుండె జబ్బులు యువతలోనే ఎక్కువగా రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం
చాలా మంది ఐఏఎస్ అధికారులు దేశ రాజధానిలో తమ సేవలందించడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవలె కాలంలో రాజకీయ నేతల ఒత్తిడి మరియు అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కారణంగా వారు ఆవైపు కూడా చూడాలనుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తోంది.