Last Updated:

Kedarnath Temple: కేదార్ నాథ్ క్షేత్రం.. చూస్తుండగానే విరిగిపడిన మంచుచరియలు

చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.

Kedarnath Temple: కేదార్ నాథ్ క్షేత్రం.. చూస్తుండగానే విరిగిపడిన మంచుచరియలు

Kedarnath Temple: చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ కు ఆనుకుని ఉన్న హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.

కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వ‌ద్ద భారీగా మంచుచ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఆల‌యం వెనుక భాగంలో ఉన్న కొండ‌చ‌రియ‌లు ఒక్కసారిగా కూలడంతో ఆ ప్రాంతమంతా భారీగా మంచు కొట్టుకువ‌చ్చింది. కాగా ఆల‌యానికి ఎటువంటి ప్ర‌మాదం జరగలేదని బ‌ద్రీనాథ్‌-కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ అధ్య‌క్షుడు అజేంద్ర అజ‌య్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. చూస్తుండ‌గానే ఒక్క‌సారిగా మంచు శిఖ‌రం నేలకొరిగి భారీ మొత్తంలో మంచు కొండ‌ల మ‌ధ్య వ్యాపించింది.

ఇదిలా ఉండగా గత కొద్దిరోజులకుగా చార్ ధామ్ యాత్ర మార్గంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనితో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!

ఇవి కూడా చదవండి: