Last Updated:

Puducherry: అంధకారంలో పుదుచ్చేరి.. సీఎం సహా గవర్నర్ తమిళిసై ఇళ్లకు పవర్ కట్

పుదుచ్చేరిలో అంధకారం అలముకుంది. సామాన్య ప్రజల ఇళ్లకు కరెంట్ పోతే ఓకే. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఇళ్లు, కార్యాలయాలకే పవర్ కట్ అయ్యిందంటే అక్కడ విద్యుత్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అదేంటి కేంద్రపాలిత ప్రాంతంలో పవర్ కట్ సమస్యేంటీ అనుకుంటున్నారు కదా. ఇది విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగ వల్ల ఏర్పడిన కోతలు.

Puducherry: అంధకారంలో పుదుచ్చేరి.. సీఎం సహా గవర్నర్ తమిళిసై ఇళ్లకు పవర్ కట్

Puducherry: పుదుచ్చేరిలో అంధకారం అలముకుంది. సామాన్య ప్రజల ఇళ్లకు పరిశ్రమలకు కరెంట్ పోతే ఓకే అదే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఇళ్లు, కార్యాలయాలకే పవర్ కట్ అయ్యిందంటే అక్కడ విద్యుత్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అదేంటి కేంద్రపాలిత ప్రాంతంలో పవర్ కట్ సమస్యేంటీ అనుకుంటున్నారు కదా. ఇది విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగ వల్ల ఏర్పడిన కోతలు.

పుదుచ్చేరిలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆఖరికి పుదుచ్చేరి సీఎం ఇంటితో పాటు గవర్నర్ తమిళి సై ఇళ్లకు కూడా కరెంటు కట్ అయ్యింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో విద్యుత్తు పంపిణీ సంస్థను ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత 4 రోజులుగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.
ఈ క్రమంలో పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంట్ నిలిచిపోయింది. సీఎం ఎన్‌.రంగస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఇళ్లకూ పవర్ కట్‌ అయ్యింది.
విద్యుత్తు పంపిణీ, రిటైల్‌ వ్యవస్థల్లోని 100 ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్లకు ఆహ్వానం పలుకుతూ టెండర్లు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాలు ముందు నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి.

కేంద్రం దిగిరాకపోవడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మొదటి రెండు రోజులు సమ్మె ప్రభావం పెద్దగా కనిపించకపోయినా శుక్రవారం నుంచి విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయి. శనివారం నాడు పుదుచ్చేరి వ్యాప్తంగా అంధకారం వ్యాపించింది. ఓ వైపు విద్యుత్తు కార్మికులు ఉద్యోగులు రోడ్డెక్కగా, మరోవైపు విద్యుత్తు కోతలతో విసిగిపోయిన ప్రజలు రోడ్లక్కి ఆందోళనలను తీవ్రతరం చేశారు. దీనితో పుదుచ్చేరి నిరసనలతో అట్టుడుకుతోంది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా ఆగిపోవటంతో విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ చిమ్మచీకట్లు వ్యాపించాయి. వాహనాలన్నీ నిలిచిపోయి రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: దేశంలో క్లీన్ సిటీగా ఆరోసారి టైటిల్ గెలుకున్న ఇండోర్

ఇవి కూడా చదవండి: