Last Updated:

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ ఫీజుపై “పేటీఎం” చీఫ్ కౌంటర్

ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ ఫీజుపై “పేటీఎం” చీఫ్ కౌంటర్

Twitter: ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పేటీఎం ఎదుర్కొంటున్న ఇబ్బందిని ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ దృష్టికి తీసుకొచ్చారు విజయ్.

పేటీఎం కస్టమర్ కేర్ పేరు, పేటీఎం అధికారిక లోగోతో నడుస్తున్న ట్విట్టర్ అకౌంట్ ను రీట్వీట్ చేస్తూ.. ఇలాంటి నకిలీ ఖాతాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని తీసేసే సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ఎలాన్ మస్క్ ను కోరారు. అలా చేస్తే ట్విట్టర్ బ్లూ టిక్ ఫీజు ఒకటి కాదు పది రెట్లు పెంచినా మారుమాట్లాడకుండా చెల్లించేందుకు సిద్ధమని శర్మ వెల్లడించారు.

ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ బ్లూటిక్ కోసం చెల్లించే ఫీజును 4 డాలర్ల పెంచుతూ నెలనెలా 8 డాలర్లు చెల్లించాలని తేల్చిచెప్పాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా మస్క్ మాత్రం వెనక్కి తగ్గలేదన్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. డైరక్టర్లుగా రాజీనామా చేసిన రాధిక, ప్రణయ్ రాయ్

ఇవి కూడా చదవండి: